Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కఠినమైన ఆహార నియమాలు అవసరం లేదు.. ఈ చిన్న అలవాట్లే ఆరోగ్యానికి అసలైన రహస్యం!

Healthy Habits for weight loss without giving up favorite foods
Advertisement
  • కఠినమైన డైట్‌లు అవసరం లేదంటున్న నిపుణులు
  • ఆకలికి తగ్గట్టు భోజనం ప్లాన్‌ చేసుకోవాలని సూచన
  • అల్పాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని హితవు
  • ఇష్టమైన ఆహారం పరిమితంగా తీసుకోవచ్చని వెల్లడి
  • చిన్న అలవాట్లే దీర్ఘకాలంలో పెద్ద ఫలితం ఇస్తాయని వివరణ
  • పోషకాహారం ఆరోగ్యానికి కీలకమన్న డబ్ల్యూహెచ్‌ఓ
Advertisement
బరువు తగ్గాలన్నా లేదా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా చాలామంది ముందుగా డైట్ (ఆహార నియమాల) గురించే ఆలోచిస్తారు. ఇందుకోసం తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెట్టి, కొన్ని రోజుల పాటు కఠినమైన నియమాలను పాటిస్తుంటారు. అయితే, ఇలాంటి కఠిన నిబంధనలను ఎక్కువ మంది మధ్యలోనే వదిలేస్తుంటారు. నిజానికి ఆరోగ్యంగా ఉండటానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజువారీ జీవనశైలిలో చేసుకునే చిన్నపాటి మార్పులే దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయని సూచిస్తున్నారు. అందుకోసం నిపుణులు చెబుతున్న ఐదు సులభమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం..

ఆకలి సంకేతాలను గుర్తించండి
ముందుగా మన శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోవాలి. రోజులో ఏ సమయంలో ఎక్కువగా ఆకలి వేస్తుందో గమనించి, దానికి అనుగుణంగా భోజన సమయాలను ప్లాన్‌ చేసుకోవాలి. సమయానికి కాకుండా, శరీరం ఇచ్చే ఆకలి సంకేతాలకు ప్రాధాన్యమిస్తే ఆహారపు అలవాట్లు సహజంగా మారుతాయి.

అల్పాహారం అత్యంత కీలకం
ఆరోగ్య సంరక్షణలో అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రోజంతా శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా.. పేగుల ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత, వ్యాయామ సామర్థ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. కేవలం వ్యాయామం చేస్తే సరిపోదని, దానికి తగిన పోషక విలువలు కలిగిన ఆహారం కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇష్టమైనవి మానేయాల్సిన పనిలేదు
ఆరోగ్యంగా ఉండాలంటే ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాటిని పరిమిత పరిమాణంలో తీసుకుంటూ, మిగిలిన భోజనాన్ని సమతుల్యంగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. కొన్ని రోజుల పాటు కఠినమైన డైట్ పాటించడం కంటే, నిత్యం ఆచరించగలిగే చిన్నపాటి ఆరోగ్యకరమైన అలవాట్లే మెరుగైన ఫలితాలను ఇస్తాయి. స్థిరంగా కొనసాగించగలిగే మార్పులే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పోషకాహారమే అసలైన బలం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా పోషకాహార ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. సమతుల ఆహారం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందినప్పుడు సహజంగానే శక్తి పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి దోహదపడటంతో పాటు పనితీరును మెరుగుపరుస్తుంది. జీవన నాణ్యతను పెంచుతుంది.
Advertisement
Advertisement
Healthy Habits
Weight Loss Tips
Balanced Diet
Nutrition Secrets
Wellness Guide
Healthy Lifestyle

More Telugu News